స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులకు
సీఎం అభినందనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) నాగ భరత్ డాకా మంగళవారం ఢిల్లీలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రయివేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ఆయనకు వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రయివేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి అభినందనలు తెలిపారు. ఇలాంటి సాంకేతిక పరిశ్రమల స్థాపనకు రాష్ర్ట ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వ–ప్రయివేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది.
మీ సాంకేతికత భేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



