Thursday, May 28, 2026
E-PAPER
Homeజిల్లాలుకామ్రేడ్ వంగర సత్తయ్య మృతి పార్టీకి తీరని లోటు

కామ్రేడ్ వంగర సత్తయ్య మృతి పార్టీకి తీరని లోటు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సిపిఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకుడు, చర్లపల్లి మాజీ సర్పంచ్ కామ్రేడ్ వంగర సత్తయ్య మృతి పార్టీకి తీరని లోటు అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. గురువారం ఉదయం వంగర సత్తయ్య భౌతిక కాయానికి పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ… చర్లపల్లి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించిన ప్రజానాయకుడు వంగర సత్తయ్య అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి తన జీవితాంతం పార్టీ బలోపేతానికి అంకితభావంతో సేవలందించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.

సత్తయ్య గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల హక్కుల కోసం ఆయన చూపిన పోరాట మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి, రాపోలు రవీందర్, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -