Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఎత్తున ఉద్యమం

సెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఎత్తున ఉద్యమం

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను
సెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఉద్యమం నిర్వహిస్తామని, పి ఆర్ టి యు, టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర బిక్షం గౌడ్ అన్నారు. సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా ముమ్మరంగా ఆలేరు పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడారు. గత మూడున్నర సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్న పేరివిజన్, కమిషన్ మరియు పెండింగ్లో ఉన్న ఆరు డి ఏ లను వెంటనే ప్రకటించకపోతే 50వేల మంది ఉపాధ్యాయులతో భారీ ఎత్తున ధర్నా చేస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుంట్ల అమరేందర్ రెడ్డి, గడ సంతల మధుసూదన్, క్రీడల చైర్మన్  బూడిద శ్రీనివాస్, ఆలేరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జోసఫ్, దశమంతు, మోట కొండూరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమా శేఖర్, నరేందర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సోమయ్య, తిరుపతిరెడ్డి, నర్సిరెడ్డి, రవికుమార్, కాంతారావు, సత్యనారాయణ రెడ్డి, నరసింహులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -