నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆగస్టు 4న హైదరాబాద్ ఆటోనగర్ కర్నాటి గార్డెన్ లో ఉదయం 10 గంటలకు జరిగే చేనేత సహకార సంఘాల పాలకుల అభినందన సభ విజయవంతం చేయాలని, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలేరు పట్టణంలో మంగళవారం మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోసం చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరాయంగా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు.
చేనేత కార్మికుల ఉద్యమాలతో పెండింగ్ లో ఉన్న నేతన్నాల బీమా బకాయిలు విడుదలయ్యాయని నూతన భరోసా పథకంలో భాగంగా మూడు నెలలకు జియో ఉన్న చేనేత కార్మికులకు 4500 మరియు అనుబంధ కార్మికులకు రూ.1500 వారి అకౌంట్లో జమ అయ్యాయని చెప్పారు. కార్మికుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముషం నరహరి, రాష్ట్ర నాయకులు చెన్న రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



