Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం 

గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 29న ఆలేరు పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, భజనలు, హారతులు, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ బొట్ల పరమేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురు పౌర్ణమి రోజున సద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు భక్తులందరూ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులకు తీర్థప్రసాదాలు, మహాప్రసాదం అందజేయనున్నట్లు చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భక్తులందరూ సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక హారతి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ బొట్ల పరమేశ్వర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -