Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన

అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో సోమవారం రాత్రి, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ప్రదర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు మరణించారని, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థి నిరసన కారులకు, పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -