నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ, సాధన కమిటీ సభ్యులు సన్నాహక సమావేశం మంగళవారం ఆర్యవైశ్య భవనంలో నిర్వహించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై, ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరిని నిరసనగా ఈనెల 31న ఆలేరు పట్టణ బంధు మరియు ధర్నా కార్యక్రమానికి సంబంధించిన విషయంపై చర్చించారు. స్థానిక అన్ని పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున సమీకరించి బందులో పాల్గొనాలని, ఆలేరు అభివృద్ధి కోసం జరిగే ఆలేరు పట్టణ బందుకు ఆలేరు మండల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు మేధావులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కొత్త కంఠంతో కోరారు.
అనంతరం రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు, ఎస్సై వినయ్ కుమార్ కు 31న జరుగు పట్టణ బంద్ సంబంధిత కరపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ పసుపునుర్ వీరేశం, కో కన్వీనర్లు రాచకొండ జనార్ధన్, చెక్క వెంకటేష్, మొరిగాడి చంద్రశేఖర్, వడ్డేమాన్ నరేందర్, పుట్ట మల్లేష్, పాసికంటి శ్రీనివాస్, చిలుకూరి నర్సిరెడ్డి, ఎలుగల కుమారస్వామి, కుర్షిత్ పాషా ,కందుల మధు, ఎండి సలీం, గార నరేష్ ,పేరపు రాములు తదితరులు పాల్గొన్నారు.



