- Advertisement -
సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతోన్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఒక అద్భుతమైన కుటుంబ వినోదాన్ని అందించ డానికి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తు న్నారు. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అను బంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించ డానికి సిద్ధమవుతోంది. ‘సార్/వాథి’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి, మరోసారి బలమైన కుటుంబ విలువలు, హృద్యమైన కథనం కలిగిన ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను అం దించబోతున్నారని, ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుం దని మేకర్స్ తెలిపారు.
- Advertisement -



