Friday, May 29, 2026
E-PAPER
Homeసినిమానిజాయితీ పరుడే.. కానీ

నిజాయితీ పరుడే.. కానీ

- Advertisement -

వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘు వంశీ, రఘుబాబు, శివన్నారాయణ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించిన సినిమా ‘ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు`. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేక‌ర్స్ గురువారం ఈ మూవీ నుంచి ‘టా టా’ అనే తొలి సాంగ్‌ని రిలీజ్ చేశారు. క‌ళ్యాణ్ నాయ‌క్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను భాస్క‌ర‌భ‌ట్ల రాశారు. న‌క‌ష్ అజీజ్ ఎన‌ర్జిటిక్ వాయిస్‌తో పాట‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఈ పాట ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు క్యారెక్ట‌ర్‌ను మ‌రింత ఎలివేట్ చేస్తోంది. సాధార‌ణ కానిస్టేబుల్ నిజాయితీగా ఉంటూ ఇత‌రుల‌కు సాయం చేస్తూనే మొండివాడుగా ఉంటుంటాడనే విష‌యాల‌ను ఈ పాట తెలియ‌జేస్తోంది. విజ‌య్ పోలాకి కంపోజ్ చేసిన కొరియోగ్ర‌ఫీ చాలా బావుంది. విజ‌య మాధ‌వి కంబైన్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి తార‌క రామారావుతో బొబ్బిలిపులి, చిరంజీవితో లంకేశ్వ‌రుడు, కృష్ణంరాజుతో క‌ట‌క‌టాల రుద్రయ్య బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు స‌హా ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ వంటి దిగ్గ‌జ న‌టుల‌తో ఎన్నో క్లాసిక్ చిత్రాల‌ను రూపొందించిన సీనియ‌ర్ నిర్మాత వ‌డ్డే ర‌మేష్ త‌న‌యుడే వ‌డ్డే న‌వీన్‌. తండ్రి గొప్ప సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వ‌డ్డే న‌వీన్‌ ఇప్పుడు మంచి కథా చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో వ‌డ్డే క్రియేష‌న్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు’.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -