దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా గురువారం ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పలువురు సినీ ప్రముఖులు పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ కార్య్రకమంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ, నందమూరి మోహన రూప , నందమూరి సీమంతిని, నందమూరి దీపిక, తుమ్మల ప్రసన్నకుమార్, పరుచూరి గోపాల కృష్ణ, బాబు మోహన్, నిర్మాత భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ,’ఈరోజు తెలుగు జాతి మరువలేని రోజు. తెలుగు జాతికి ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు జాతికి ఒక వరం. ఆయన ఆశీస్సులు తెలుగు వారందరికీ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నానుఅని అన్నారు. 'తెలుగు జాతి ఆరాధ్య దైవం, మా నాన్న ఎన్టీఆర్ గురించి అందరూ చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. సినీ, రాజకీయ రంగాలలో ఆయన ప్రజలను మెప్పించిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో పేదవాళ్ల ఆకలి తెలిసిన వ్యక్తి కాబట్టి ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేదవారి దైవంగా నిలిచారు. మహిళలకి ప్రత్యేక హక్కులు, అలాగే ఆస్తులలో వాటాలు ఉండాలని గుర్తించిన వ్యక్తి. ఇప్పుడు దేశం అంతటా మనం ఆ మార్పును చూస్తున్నాము. అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహా విష్కరణను చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి నా కృతజ్ఞతలు అని నందమూరి మోహన కృష్ణ అన్నారు. బాబు మోహన్ మాట్లాడుతూ,’ మా తల్లితండ్రులు అన్న అభిమానులు. నా చిన్నప్పటి నుండి ఆయనను అభిమానిస్తూ వచ్చాను. రాజకీయం అంటే ఏంటో తెలియని నన్ను రాజకీయాలకు ఆహ్వానించి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ప్రజల కోసం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న వ్యక్తిఅని అన్నారు. నిర్మాత భరద్వాజ్ మాట్లాడుతూ, 'దేశంలో మన తెలుగు వారిని ఒక అడుగు ముందుకు నడిపించిన నందమూరి తారక రామారావు మన తెలుగు వారు కావడం ఎంతో గర్వంగా ఉంది అని చెప్పారు. తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ,’అప్పట్లోనే ఫ్యాన్ ఇం డియా స్టార్ రామారావు. ఆయన వల్ల ఎంతోమంది రాజ కీయాల్లో వచ్చి చైతన్యంగా పనిచేశారు` అని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం వెయ్యి మందికి పైగా ప్రజలకు అన్నదానం చేశారు.
ఎన్టీఆర్.. తెలుగు జాతికి ఓ వరం
- Advertisement -
- Advertisement -



