‘ప్రధాని మోదీ ‘పెద్ది’ గురించి అడిగారు. గ్రామాలకు సాధికా రతను అందించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. ఇది అందరినీ ఇన్‌స్పైర్ చేస్తూ లార్జ్ స్కేల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాఅని రామ్ చరణ్ అన్నారు. ఆయన నటించిన యాక్షన్ డ్రామా చిత్రం 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించింది. రామ్ చరణ్ మాట్లాడుతూ,'ఈ సినిమా కోసం మేమంతా ఎంతో నిజాయితీగా పనిచేశాం. ఇది చాలా గొప్ప ఎంటర్‌టైనర్. ప్రేక్షకులను ఇన్‌స్పైర్ చేసే సినిమా. ఈ సినిమాను పిల్లలతో కలిసి థియేటర్లలో చూడండి. వాళ్లు చాలా ఇన్‌స్పైర్ అవుతారు. ఇది మట్టి వాసన ఉన్న కథ. భారతదేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు చాలామంది ట్రైబల్ ప్రాంతాల నుంచే వచ్చారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసి నప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వెస్ట్ బెంగాల్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు కొంత మంది యువ కులు పైన జెర్సీ, కింద లంగోటా ధరించి కనిపించారని, వాళ్లు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చామని చెప్పారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మొహమ్మద్ అనే వ్యక్తి భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడాడు. ఇప్పుడు అదే గ్రామం నుంచి 80 శాతం మంది ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఒక్క వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో అది చూపిస్తుంది. ‘పెద్ది’ కూడా అలాంటి ఒక కథ అని తెలిపారు.
గ్రామాలకు సాధికారత కాన్సెప్ట్‌తో ‘పెద్ది`
- Advertisement -
- Advertisement -



