Friday, May 29, 2026
E-PAPER
Homeజిల్లాలుఉపాధి హామీ..గుండుతో కూలీ..హాజ‌రున‌మోదుకు క‌ష్టాలు

ఉపాధి హామీ..గుండుతో కూలీ..హాజ‌రున‌మోదుకు క‌ష్టాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉపాధి హామీ కూలీలు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనేక క‌ష్టాలు ప‌డుతున్న‌తున్న విష‌యం తెలిసిందే. తాజాగా హాజరు నమోదుకు కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడుతున్నాయి. ఓ కూలీ గుండు చేయించుకుని ఉపాధి పనులకు వెళ్లగా.. మొబైల్ సాఫ్ట్‌వేర్ అతడి ముఖాన్ని గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మల్యాల శ్రీను రెండు రోజుల క్రితం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించాడు. గురువారం నాడు ఉపాధి పనులకు వెళ్లగా.. హాజరు సమయంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అతని ముఖాన్ని గుర్తించలేదు. పలుమార్లు ప్రయత్నించినా హాజరు నమోదు కాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో నల్లటి బొగ్గుతో గడ్డం, మీసాలు దిద్దుకుని.. తలపై వెంట్రుకలు ఉన్నట్లు ఓ మహిళ జుట్టును పెట్టుకోగా.. యాప్ గుర్తించింది. ఇది కాస్త అక్కడ ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -