నవతెలంగాణ – ఆర్మూర్
ఆర్మూర్ మండల కేంద్రానికి చెందిన మచర్ల గ్రామంలో మహిళా సంఘం అధ్యక్షురాలు స్పందనకు గ్రామ సర్పంచ్ కట్ట నర్సయ్య ఆధ్వర్యంలో బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ,ఢిల్లీ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే వందేమాతరం గీతం ఆలపించే అవకాశం లభించగా, అందులో మచర్ల గ్రామానికి చెందిన స్పందనకు అవకాశం రావడం గ్రామానికి గర్వకారణమని అన్నారు. ఢిల్లీలో జాతీయ వేదికపై మచర్ల గ్రామానికి, తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ వందేమాతరం గీతం ఆలపించడం అత్యంత గౌరవప్రదమైన విషయం అని ఆయన పేర్కొన్నారు. స్పందన సాధించిన ఈ ఘనతతో మచర్ల గ్రామ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా పెరిగిందని, భవిష్యత్లో మరింత మంది మహిళలు ఇలాంటి ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం బుమేశ్వర్ గౌడ్ , పంచాయతీ కార్యదర్శి నసీర్, మహిళా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొని స్పందనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
ఢిల్లీలో వందేమాతర గీతాన్ని ఆలపించిన స్పందన కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



