Saturday, May 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాడుపడ్డ స్థితిలో దాసరి సమాధి..శుభ్రం చేయించిన మంచు మనోజ్

పాడుపడ్డ స్థితిలో దాసరి సమాధి..శుభ్రం చేయించిన మంచు మనోజ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా, ఆయన సమాధి పరిస్థితిపై ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. సంరక్షణ కరువై, పిచ్చిమొక్కలు, చెత్తతో నిండిన సమాధి దృశ్యాలు చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన హీరో మంచు మనోజ్, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాయి.

దాసరి నారాయణరావు, ఆయన భార్య పద్మ గార్ల సమాధులు ఉన్న ప్రదేశం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్న హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కనిపించాయి. మే 30న ఆయన వర్ధంతి రోజే ఈ వీడియో బయటకు రావడంతో, పరిశ్రమ వర్గాలు, అభిమానులు తీవ్రంగా చలించిపోయారు. ఒక లెజెండరీ డైరెక్టర్‌కు ఇలాంటి పరిస్థితి రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వీడియో చూసి చలించిపోయిన హీరో మంచు మనోజ్ వెంటనే దాసరి సమాధి వద్దకు చేరుకున్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన మహానుభావుడి స్మారకం ఇలా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, తన వెంట తెచ్చుకున్న సిబ్బందితో కలిసి స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులను పర్యవేక్షించారు. అనంతరం దాసరి, పద్మ గార్ల సమాధులకు నమస్కరించి నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -