నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులను కూలీలతో ముమ్మురంగా చేయిస్తున్నామని గ్రామ సర్పంచ్ అస్పత్వార్ అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ , ఫీల్డ్ అసిస్టెంట్ సుభాష్ మాట్లాడుతూ గ్రామంలో వర్షం పడినప్పుడల్లా వరద నీరు భారీగా వ్యవసాయ భూములలో ప్రవహిస్తూ ఉండేదని అన్నారు. నీరు పోవడానికి ఫీడర్ ఛానల్ అత్యవసరం కావడంతో రైతులకు పంట నష్టం జరగకుండా ఉండాలంటే ఫీడర్ ఛానల్ ఏర్పాటు తవ్వకాలు చేసామని తెలిపారు. నిత్యం ఉదయం పూట తొందరగా పని ప్రదేశంలో హాజరై పనులు ముగించుకొవాలని సూచించారు. పని ప్రదేశాల్లో నీరు, నీడ కల్పించాలని కోరుతూ సర్పంచ్ నీటి వసతి సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ సుభాష్, జిపి కార్యవర్గ సభ్యులు , జిపి కార్యదర్శి జిపిఓ రమేష్ , తదితరులు పాల్గొన్నారు.
పెద్దఎడ్గిలో మమ్మురంగ కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



