Saturday, May 30, 2026
E-PAPER
Homeఆటలుఆసియా క్రీడల ట్రయల్స్‌లో వినేశ్ ఫొగాట్‌కు నిరాశ..

ఆసియా క్రీడల ట్రయల్స్‌లో వినేశ్ ఫొగాట్‌కు నిరాశ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత స్టార్ రెజ్లర్, జులనా ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్‌కు ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు ఆదేశాలతో బరిలోకి దిగిన ఆమె, శనివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆసియా రజత పతక విజేత మీనాక్షి గోయట్ చేతిలో 4-6 తేడాతో వినేశ్ ఓడిపోయారు. దీంతో ఈ ఏడాది జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు అర్హత సాధించే అవకాశాన్ని ఆమె కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -