శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, ‘టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ఇలాంటి మంచి కామెడీ సినిమాలు రావాలి. టైటిల్‌లో డాక్టర్, మన అని పదాలు అంటే కచ్చితంగా హిట్ అవు తుంటాయి. ఇలాంటి ప్రాజెక్టులకు తోడుగా నిలబడిన అలీ, రాజీవ్ కనకాలకి థ్యాంక్స్. ఏవీఎస్ కూతురు శాంతి మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉందిఅని అన్నారు. 'ఇది చాలా మంచి కథ. ఇలాంటి సెన్సిటీవ్ పాయింట్‌ను జాగ్రత్తగా తెరకెక్కించాం. టీజర్ చూసి కేవలం యూత్ సినిమా అని అనుకోకండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఈవీవీ, జంధ్యాల సినిమాల్లా ఉంటుంది. ప్రతీ ఫ్యామిలీ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతుంది. నేను ఈ చిత్రాన్ని చూశాను. మంచి సినిమా చేశాను అనే ఫీలింగ్ నాకు కలిగింది అని హీరో శ్రీ స్కంద చెప్పారు. దర్శకుడు చలపతి కుమార్ మాట్లాడుతూ, ‘ప్రతీ సీన్‌కు ఆడియెన్స్ కచ్చితంగా నవ్వుతారు. ఇలాంటి కాన్సెప్ట్‌కి ఓ చిన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్‌ను దాటలేదు. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. చివరకు థియేటర్ నుంచి కన్నీటి చెమ్మతో బయటకు వెళ్తారు` అని తెలిపారు. నిర్మాత కృతాక్షి మాట్లాడుతూ, ‘మా సిని మాకి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఆద్యంతం నవ్వించే సినిమా
- Advertisement -
- Advertisement -



