Monday, June 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాతో రాజీ పడే ప్రసక్తే లేదు

అమెరికాతో రాజీ పడే ప్రసక్తే లేదు

- Advertisement -

ఇరాన్‌ ‌స్పష్టీకరణ
ప్రముఖ మేథోసంస్థ ఐసీడబ్ల్యూ సీటీపీ వెల్లడి
ఒప్పందానికి చేరువగా ఉన్నాం.. చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదు : ట్రంప్

అమెరికా నుంచి తీవ్రస్థాయి బెదిరింపులు వచ్చినా.. దాడులకు తెగబడినా తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఇరాన్‌ ‌కృత నిశ్చయంతో ఉన్నట్టు ప్రముఖ మేథో సంస్థ (థింక్‌ ‌ట్యాంక్‌) ఇన్‌‌స్టిట్యూట్‌ ‌ఫర్‌ ది ‌స్టడీ ఆఫ్‌ ‌వార్‌ ‌క్రిటికల్‌ థ్రెట్స్‌ ‌ప్రాజెక్టు (ఐసీడబ్ల్యూ – సీటీపీ) విశ్లేషించింది. అమెరికా, ఇరాన్‌ ‌మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్‌‌కు చెందిన మిలిటెంట్‌ ‌స్వభావిత అధికారిక గ్రూపులు (హార్డ్‌ ‌లైనర్స్‌) అమెరికాతో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేవని వెల్లడించింది. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌‌జీసీ) ఉన్నతాధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి గుండా జరిగే సముద్ర రవాణాపై ఆధిపత్యాన్ని చూపించేందుకు ఐఆర్‌జిసి కొత్త యథాతథ స్థితిని ప్రతిపాదించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని తెలిపింది. అంతర్జాతీయ జలాల్లో నావిగేషన్ స్వేచ్ఛకు ఇది ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందని ఐసిడబ్ల్యు సిటిపి వెల్లడించింది. ఇరాన్‌లోని హార్డ్‌లైన్ గ్రూపులు ఏకరూపంగా లేవని, అందులో విభిన్న అభిప్రాయాలు, ప్రాధాన్యతలు కలిగిన గ్రూపులు కూడా ఉన్నాయని పేర్కొంది. అయితే ఐఆర్‌జిసి కమాండర్ మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న నాయకత్వ బృందం అమెరికాతో చర్చల్లో రాజీకి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది.

టెహ్రాన్/వాషింగ్టన్ : శాంతి ఒప్పందానికి ముందు ఎంఓయూ (అవగాహనా ఒప్పందం) కుదుర్చుకునేందుకు ఇరాన్, అమెరికా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఎంఓయూను ఖరారు చేయడానికే చాలా కాలం పడుతోంది. దీనికి కారణం దానిలోని ప్రతి పదాన్ని విశ్లేషించి, చర్చించాల్సి వస్తోంది. ఒక అంశానికి, మరో అంశానికి మధ్య ఉన్న సంబంధాన్ని నిశితంగా పరిశీలి స్తున్నారు. ఉదాహరణకు ఎంఓయూ కుదిరిన తర్వాత 60 రోజులలోగా తుది ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణ యించారు. అయితే ఈ 60 రోజుల ప్రక్రియను వారాల తరబడి కొనసాగుతున్న కాల్పుల విరమ ణకు పొడిగింపుగా భావిస్తారా లేదా శత్రుత్వానికి ముగింపుగా భావిస్తారా అనేది తెలియడం లేదు. ఎంఓయూను కేవలం ఒకే పేజీలో పొందుపరిచారు. దీనిలో దాదాపు డజను అంశాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ అది అంత తేలికగా తేలే విషయంగా కన్పించడం లేదు.

ట్రంప్ తాజా డిమాండ్లతో పరిస్థితి జటిలం
‘వారు ఏయే అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నారో, తొలి దశలో ఏ మేరకు రాయితీలు ఇవ్వడానికి సుము ఖంగా ఉన్నారో స్పష్టంగా తెలియాల్సి ఉంది. అప్పుడే దౌత్య పరి ష్కారం సాధ్యపడుతుంది’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను దీర్ఘకాలిక పరిష్కారంగా మార్చే విష యంపై ఇరుపక్షాలు తాత్కాలికంగా ఒప్పందానికి వచ్చాయని అమెరికా అధికారులు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక డిమాండ్లను తెర పైకి తీసుకురావడంతో పరిస్థితి జటిలంగా మారింది. హార్ముజ్ జలసంధిని తెరవాలని, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు. దీనికి ఇరాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశాలలో స్తంభింపజే సిన తన ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతుండగా ట్రంప్ దానిపై పెదవి విప్పడం లేదు. అమెరికా డిమాండ్లు వాస్తవానికి అభ్యర్థనలేనని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఎంఓయూపై చర్చలు మాత్రం ఇంకా పురోగతిలోనే ఉన్నాయని తెలుస్తోంది.

హార్ముజ్‌పై
హార్ముజ్ జలసంధిలో మూడు నెలలుగా వాణిజ్య నౌకల రాకపోకలు స్తంభించిపోవడంతో ముడి చమురు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ముందుగా నౌకాయానంపై ఒప్పందానికి రావాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. జలసంధిని వెంటనే తెరవాలని, ఎలాంటి సుంకాలు`నియంత్రణలు లేకుండా నౌకాయానాన్ని అనుమతించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని కూడా ఆయన అంటున్నారు. అదే సమయంలో ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని చెప్పారు. అయితే ఒమన్‌తో కలిసి అంతర్జాతీయ జలమార్గం మీదుగా నౌకల రాకపోకలను పర్యవేక్షించే హక్కు తనకు ఉన్నదని ఇరాన్ అంటోంది. హార్ముజ్‌లో ఒమన్ ప్రమేయాన్ని వ్యతిరేకించడంతో పాటు దానికి ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. హార్ముజ్‌లో ఇరాన్ నియంత్రణలు, ఏర్పాట్లు స్వభావరీత్యా శాశ్వతమైననవి, అవి తాత్కాలికమైనవేమీ కావని పార్లమెంటుకు చెందిన జాతీయ భద్రతా కమిషన్ అధిపతి ఇబ్రహిం అజిజి స్పష్టం చేశారు.

హార్ముజ్‌ను తెరిస్తేనే ఆర్థిక డిమాండ్ల పరిష్కారం
విదేశాలలోని బ్యాంకులలో ఉన్న అనేక బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను అమెరికా స్తంభింపజేసిందని, వాటిని వెంటనే విడుదల చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే హార్ముజ్‌ను ఇరాన్ తిరిగి తెరిచినప్పుడే ఇది జరుగుతుందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ‘తదుపరి నోటీసు జారీ అయ్యే వరకూ నగదు బదిలీ జరగదు’ అని ట్రంప్ కూడా తెలిపారు. ఎంఓయూకు రెండు దేశాలు అంగీకరిస్తే 24 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఇరాన్ ఆస్తులను అమెరికా విడుదల చేయాల్సి ఉంటుంది. తుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ పునర్నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి నిధిపై కూడా చర్చలు జరుగు తున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల కారణంగా 270 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని ఇరాన్ అధికారులు అంచనా వేశారు. కాగా హార్ముజ్‌ను తిరిగి తెరిచినప్పుడే ఇరాన్‌పై విధించిన ఆంక్షల ఎత్తివేత జరుగుతుందని కూడా అమెరికా చెబుతోంది. తద్వారా టెహ్రాన్ ఆర్థిక డిమాండ్లను హార్ముజ్‌తో ముడిపెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.

లెబనాన్‌పై…
ఇరాన్‘అమెరికా మధ్య జరుగుతున్న చర్చలలో లెబనాన్ అంశం కూడా ముందుకు వస్తోంది. లెబనాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు సహా అన్ని వైపుల నుంచి యుద్ధం ఆగిపోవాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. అయితే ఇజ్రాయిల్ దళాలు మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకుపోతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అదే సమయంలో హిజ్బొల్లా కూడా ఇజ్రాయిల్ దళాలపై రాకెట్లు, డ్రోన్లు ప్రయోగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -