రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులుగా భూక్యా శ్రీనివాస్, వంగూరు రాములు, కనకయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర నాలుగోవ మహాసభ శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ సభలో నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధ్యక్షులుగా భూక్యా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వంగూరు రాములు, కోశాధికారిగా మామిడాల కనకయ్య ఎన్నికయ్యారు. మరో 29 మంది ఆఫీస్ బేరర్లు, 65 మంది కమిటీ సభ్యులతో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నికైంది. మహాసభలలో హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, సివిల్ సప్లై జీసీసీ హమాలీలకు వెంటనే రేట్ల ఒప్పందం చేసి అమలు చేయాలని పలు తీర్మానాలు చేశారు. కార్మిక వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ‘మతోన్మాద చర్యలను వ్యతిరేకిద్దాం… మతసామరస్యాన్ని కాపాడుకుందాం’అంటూ ప్రతినిధులంతా ప్రతినబూనారు. కార్మిక పోరాటాల పై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ఆపాలనీ, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత సంక్షేమ పథకాలు అమలు చేయాలనీ, ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆల్ హమాలీ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



