Monday, June 1, 2026
E-PAPER
Homeజాతీయంకేరళలో భారాలు షురూ

కేరళలో భారాలు షురూ

- Advertisement -

పాల ధర లీటరుకు రూ.4 పెంపు
తిరువనంతపురం : కేరళలో ప్రజలపై భారాలు మొదలయ్యాయి. పాల ధరను ఏకంగా లీటరుకు రూ.4 పెంచేశారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నందున ధరల పెంపు అనివార్యమైందని కేరళ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య (మిల్మా) తెలిపింది. తాజా పెంపుతో మిల్మా డబుల్ టోన్డ్ మిల్క్ (మిల్మా స్మార్ట్) 500 ఎంఎల్ సాచెట్ ధర ₹ 27 కి, హోమోజనైజ్డ్ టోన్డ్ మిల్క్ ధర ₹ 28 కి, మిల్మా ప్రైడ్ (హోమోజనైజ్డ్) ధర ₹ 30 కి పెరగనుంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పాటు ఇంధన ధరలు పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తుల రవాణా, పంపిణీ, ప్యాకేజింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, సహకార పాడి రంగాన్ని నిలబెట్టేందుకు పాల ధరలను పెంచాల్సివచ్చిందని మిల్మా ఛైర్మెన్ కేఎస్ మణి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -