- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి జూన్ 6 వరకూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతవరణ శాఖ తెలిపింది. పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనీ హెచ్చరించింది. అలాగే నేటి నుంచి ఈ నెల 4 వరకూ రాయలసీమ, తీర ప్రాంత ఏపీ, యానాంలో పిడుగులతో వర్షం పడుతుందని, ఈదురు గాలులు గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ తెలిపింది.
- Advertisement -



