నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ను పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున ముందస్తుగా అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అందులో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ను అదుపులోకి తీసుకొని కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తు అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం పట్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు.



