ఎస్సై మోహన్ రెడ్డికి గ్రామ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్ తీర్మానం కాపీ అందజేత
నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో గ్రామ ప్రజల తీర్మానం మేరకు గ్రామంలో మద్యపానం నిషేధించినట్లు ఆ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్ తెలిపారు. ఈ మేరకు తీర్మాన కాపీలను మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డికి, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయన సోమవారం అందజేసినట్లు తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నా వాటిపట్ల గ్రామ ప్రజలు, ముఖ్యంగా యువకులు చెడిపోవడమే కాకుండా అనారోగ్యాల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ఈ కారణంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. సుల్తాన్ పేట్ గ్రామంలో జూన్ 2 నుండి మద్యపానాన్ని పూర్తిగా నిషేదిస్తున్నామి ఆయన తెలిపారు. గ్రామస్తుల విన్నపం మేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసినట్లు చెప్పారు.
జూన్ 2 నుండి సుల్తాన్ పెట్ లో మద్యపానం నిషేధం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

