ఆర్సీబీ యాజమాన్యం ప్రకటన
బెంగళూరు: 2026 ఐపిఎల్ టైటిల్ ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)యాజమాన్యం మరోసారి విజయోత్సవ
వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 సీజన్ లో 17ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి బెంగళూరు ఐపిఎల్ టైటిల్ కైవసం చేసుకొని ఫుల్ జోష్ లో ఉన్న దశలో చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానుల జనసంద్రోహం మధ్య జరిగిన తొక్కిసలాటలో సుమారు 11మంది చనిపోవడంతోపాటు దాదాపు 50మంది త్రీవ గాయాల బారిన పడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వరుసగా రెండోసారి టైటిల్ ను కైవసం చేసుకున్నా..మరోసారి విజయోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని సోమవారం విడుదల చేసింది.అభిమానులెవ్వరూ బయటికి రావొద్దని అందరూ ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో ఉండాలని తాజాగా ప్రకటించింది.ఇక ఆర్సీబీ వరుస రెండు సీజన్లలో ఐపిఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా నిలిచింది.ఇంతకుముందు చెన్నై(2010, 2011), ముంబయి(2019, 2020) వరుసగా రెండుసార్లు టైటిళ్లను ముద్దాడాయి.కగిసో రబడా(29వికెట్లు)అత్యధిక వికెట్లు పర్పుల్ క్యాంప్ ను అందుకోగా.. 15ఏళ్ల రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(776పరుగులు)ఆరెంజ్ క్యాప్ అవార్డులు అందుకున్నారు.
వైభవ్ సూర్యవంశీకి ఐదు..
ఐపిఎల్ అవార్డుల కార్యక్రమంలో రాజస్తాన్ రాయల్స్ 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.అతడు ఏకంగా 5అవార్డులను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. 2026 ఐపిఎల్ సీజన్ లో అత్యధికంగా 776పరుగులు కొట్టినందుకు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.అలాగే ఎమర్జింగ్ ప్లేయర్,మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్,ఉత్తమ స్ట్రైక్ రేట్ మరియు అత్యధిక సిక్సర్ల అవార్డులను అందుకున్నాడు.ఐపిఎల్ చరిత్రలోనే ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు క్రిస్ గేల్(59) 14ఏళ్ల రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు.ఈ సీజన్ లో సూర్యవంశీ ఏకంగా 72సిక్సర్లు బాది రికార్డు పుటల్లోకెక్కాడు.
ప్లే-ఆఫ్స్ కే రూ.46కోట్ల ప్రైజ్ మనీ పంపకం:బిసిసిఐ
2026సీజన్ ప్లే-ఆఫ్స్4మ్యాచులకే రూ.46కోట్ల ప్రైజ్ మనీ పంపకం చేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ)సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.టైటిల్ విజేత బెంగళూరుకు రూ.20కోట్లు,రన్నరప్ గుజరాత్ కు రూ.12.5కోట్లు ప్రైజ్ మనీ అందజేసినట్లు తెలిపింది.అలాగే ప్లే-ఆఫ్స్ లో ఓడిన రాజస్తాన్ కు రూ.7.5కోట్లు,సన్ రైజర్స్ హైదరాబాద్ కు రూ.6కోట్లు చొప్పున ముట్టజెప్పినట్లు తెలిపింది.
విజయోత్సవ వేడుకలకు బెంగళూరు దూరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



