Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

- Advertisement -

– సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
గ్రామాల్లో సేవలందించే పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య  కార్మికులకు సేఫ్టీ హెల్మెట్లు, సేఫ్టీ షూ సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఎండనక-వాననక, రేయనక-పగలనక ప్రజలకు అందించే సేవలు ఎంతో విలువైనవి అన్నారు. గ్రామం పరిశుభ్రంగా, ప్రజలు ఆరోగ్యంతో ఉన్నారంటే అందుకు పారిశుద్ధ్య కార్మికుల సేవలే ప్రధానమన్నారు. ప్రజలు కూడా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి సహకరించాలని కోరారు. మురికి కాలువల్లో గాజు సీసాలు పాడవేయొద్దని వాటిని శుభ్రం చేసేందుకు పారిశుద్ధ కార్మికులు మురికి కాలువల్లో దిగిన సమయంలో గాయాలపాలైన సందర్భాలు ఉన్నాయన్నారు. తమ సేవలను గుర్తించి తమ రక్షణ కోసం సేఫ్టీ హెల్మెట్లు, సేఫ్టీ షూ అందజేసిన సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, పంచాయతీ పాలకవర్గం సభ్యులకు పారిశుద్ధ్య  కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినోద్, వార్డు సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -