17వ వార్డు అభ్యర్థి చేన్న స్వాతి మహేష్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నన్ను ఆశీర్వదిస్తే, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ భువనగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 17వ వార్డు అభ్యర్థి చేన్న స్వాతి మహేష్ అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, ఈ వార్డు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.
కరోనా బాధితులకు అండగా ఉన్నా..
కరోనా సమయంలో వలస కార్మికులకు అండగా ఉంటూ ప్రతిరోజు 1000 నుంచి 1200 మందికి ఆహారం అందజేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం తో పాటు సాయంత్రం కూడా ఆహారాన్ని అందజేసి వారికి పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసి అండగా ఉన్నట్లు తెలిపారు. చనిపోయిన వారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తూ నేనున్నా అని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం సొంత నిధులతో నల్ల పోచమ్మ, హనుమాన్ దేవాలయాలను నిర్మించినట్లు తెలిపారు. 1,15,16,17 వార్డులకు సంబంధించి రైల్వే గేటు ప్రధాన సమస్య ఉండడంతో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సహకారంతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నూతన వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు.
మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది..
వార్డులో ప్రచారం చేసినప్పుడు వార్డు ప్రజలు తమను అక్కున చేర్చుకుంటూ, తమ కుటుంబాల సభ్యులుగా ఆదరిస్తున్నారని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తమ మద్దతు తెలిపి, దీవిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు. ఒకసారి అవకాశం ఇస్తే వాటితో పాటు భువనగిరి పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు తెలిపారు.
మీరు గెలిచిన తర్వాత వార్డును ఎలా అభివృద్ధి చేస్తారు..
వార్డ్ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ఎస్సీ కాలనీలో స్మశాన వాటిక ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. శ్రీరామ్‌నగర్ కాంపౌండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు, శ్రీరామ్ నగర్ లో ఎర్ర పోచమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలు ఉన్నట్లు తెలిపారు.



