Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక గెజిటెడ్ హెడ్మాస్టర్ లనే ఎంఈఓగా నియమించాలి

స్థానిక గెజిటెడ్ హెడ్మాస్టర్ లనే ఎంఈఓగా నియమించాలి

- Advertisement -

 డిటిఎఫ్ మహా ముత్తారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
నవతెలంగాణ – మహా ముత్తారం(మల్హర్ రావు) :-
మహ ముత్తారం మండలంలోని విద్యా శాఖలో పనిచేస్తున్న సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులనే మండల విద్యాధికారిగా నియమించాలని డెమొక్రటిక్ టీచర్ ఫెడరేషన్ మహాముత్తారం మండల శాఖ అధ్యక్షుడు జాటోత్రామ్ సింగ్,ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో మహముత్తారం మండలంలో పిజిహెచ్ఎంలు లేకపోవడంతో పక్క మండలం భూపాల పల్లి నుండి మండల విద్యాధికారిగా నియమించడం జరిగినదని,కానీ మండలంలో మూడు ఉన్నత పాఠశాలలకు ముగ్గురు పిజిహెచ్ఎంలు నియమితులు కావడంతో స్థానికంగా ఉన్న వారిని విద్యాధికారిగా నియమించాలని కోరారు.అధికారులు ఇట్టి విషయంలో స్పందించి ముగ్గురు పిజిహెచ్ఎంలలో సీనియర్ హెడ్మాస్టర్ ని మహా ముత్తారం మండల విద్యాశాఖ అధికారిగా నియమించాలని తద్వారా మండలంలోని పాఠశాలలకు సులువైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -