Tuesday, June 2, 2026
E-PAPER
Homeసినిమాఅభిమానులకు పుట్టినరోజు కానుక

అభిమానులకు పుట్టినరోజు కానుక

- Advertisement -

హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీ చంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఇప్ప టికే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ పుట్టినరోజు సంద ర్భంగా ఈనెల 10న ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో ఉన్న ట్యాగ్‌లైన్ బాలకృష్ణను సరికొత్త అవతారంలో చూపించ బోతున్న సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగు తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -