Wednesday, June 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలో నేడు.. రేపు భారీ వర్షాలు

రాష్ట్రంలో నేడు.. రేపు భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ రంగు.. మిగిలిన జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోని తల్లాడలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట 4, దమ్మపేట 3, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెం.మీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 27 జిల్లాలో 40.2-44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -