- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెర్కిట్ ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బుధవారం బడిబాట ర్యాలీ నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. గహ ఇంటింటా ప్రచారం చేస్తూ తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చెప్పి కోరడం జరిగింది. పాఠశాల ఉత్తీర్ణతా శాతం, వివిధ కార్యక్రమాల నిర్వహణ, పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి కరపత్రాలతో ప్రచారం చేయడం జరిగింది. దీనికి తల్లిదండ్రులు తమ విద్యార్థిని విద్యార్థులను పాఠశాలకు పంపించడానికి ఆసక్తిని కనబరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -



