Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు ఎక్సైజ్ కార్యాలయంపై వచ్చిన కథనం అవాస్తవం

ఆలేరు ఎక్సైజ్ కార్యాలయంపై వచ్చిన కథనం అవాస్తవం

- Advertisement -

ఆలేరు ఎక్సైజ్ సి ఐ దీపిక 
నవతెలంగాణ-ఆలేర్ రూరల్

ఒక దినపత్రికలో బుధవారం రోజున”నిద్రపోతున్న వ్యవస్థ” శీర్షికతో ఆలేరు ఎక్సైజ్ కార్యాలయంపై ప్రచురితమైన కథనంలో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవమని ఆలేరు ఎక్సైజ్ శాఖ సి ఐ దీపిక స్పష్టం చేశారు. కథనంలో ప్రచురించిన సిబ్బంది నిద్రపోతున్న ఫొటోకు ఆలేరు ఎక్సైజ్ కార్యాలయంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎక్కడో ఇతర ప్రాంతంలో తీసిన చిత్రానికి  ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ తో ఆలేరు ఎక్సైజ్  కార్యాలయానికి చెందినదిగా చూపిస్తూ ప్రచురించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన ఎక్సైజ్ స్టేషన్  సిబ్బంది నిద్రిస్తున్న గది కి.ప్రస్తుతం  ఉన్న ఎక్సైజ్ బిల్డింగ్ కి ఎలాంటి పోలిక లేదన్నారు. ఈ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు.ఆలేరు ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ,కార్యాలయానికి వచ్చే ప్రజల ఫిర్యాదులు,వినతులను స్వీకరించి తక్షణ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాలయం నిరంతరం పనిచేస్తోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -