Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూక్య

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూక్య

- Advertisement -

గుర్తురు ఆనకట్ట నెల్లికుదురుకు వచ్చే చెరువు కట్టు కాలువకు పనులు ప్రారంభం 
రూ.49 లక్షల 65 వేలతో కాచికల్ కట్టు కాలువ మరమత్తు పనులు ప్రారంభం
మహబూబాబాద్‌ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
రైతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా గుర్తురు ఆనకట్ట నుండి నెల్లికుదురు పెద్ద చెరువుకు వచ్చే కట్టు కాలువకు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. రూ.49 లక్షల 65 వేలతో కాచికల్ కట్టు కాలువ వద్ద ఆ గ్రామ సర్పంచ్ ఇట్టే లీలా దేవేందర్ రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు.నెల్లికుదురు మండల పరిధిలోని కాచికల్ గ్రామంలో కట్టు కాలువ ద్వారా వచ్చే నీటి సరఫరాతో పంటలు పండించే రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుందని  రైతులకు రుణమాఫీ, సన్నాలకు బోనస్, సకాలంలో రైతులకు కావాల్సిన యూరియా సరఫరా చేస్తుందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని అన్నారు. అంతే కాకుండా కాచికల్ ఎర్రబెల్లి గ్రామాల మధ్య గుంతలతో ఉన్న రోడ్డు వలన అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆ రోడ్డు పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మేల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు,మండల తహసీల్దార్ చందా నరేష్,కాచికల్  నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్,మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ ఎదవ రెడ్డి, జిల్లా నాయకులు నాయిని సత్యపాల్ రెడ్డి, కాసం లక్ష్మారెడ్డి, గూగులోత్  బాలాజీ, నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…నెల్లికుదురు మండలం లో ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.

రామన్నగూడెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
నెల్లికుదురు మండలం పరిధిలోని రామన్నగూడెం లో ప్రజల ఆరోగ్యం వారి సౌకర్యార్థల కోసం  నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్నీ సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్‌ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్ తెలిపారు బుధవారం స్థానిక సర్పంచ్ బండి శ్రీనివాస్ జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ స్థానిక వైద్యాధికారులు రమ్య చైతన్యలతో కలిసి  ప్రారంభించారు. రామన్నగూడెం లో ప్రజలు ఎవరు కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదని మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నటువంటి మారుమూల గ్రామం  రామన్న గూడెం గ్రామ ప్రజల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి ఇక్కడి ప్రజల సమస్యను తీసుకెళ్ళి సుమారు 16 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించి నేడు నిర్మాణం పూర్తి చేసుకుని గ్రామ ప్రజలకు అంకితమివ్వడం ఆనందంగా ఉందని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య  సేవలు అందుబాటులోకి రావడం శుభపరిణామని అన్నారు.అంతేకాకుండా ఇక్కడ ప్రజలను వైద్యులు ఇబ్బందులు పెట్టకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట జిల్లా వైద్యశాఖ అధికారి రవి రాథోడ్,మ, ఏఎన్ఎం లు,ఆశావర్కర్ లు,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు,మండల పార్టీ నాయకులు, మండల సర్పంచులు పాల్గొన్నారు.,వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

వివో భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన: ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ 
నెల్లికుదురు మండలం పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వివో భవనం నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ బండి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్త్రీ శిశు మహిళా సంక్షేమం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క  ఆధ్వర్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ ల నిర్వహణ, మహిళా సంఘాలకు క్యాంటీన్ లు, మహిళా సంఘాలకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో సంచార ఫిషరీస్ వాహనాలు ఇవ్వడమే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని మహిళలు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట మండల వివిధ శాఖల అధికారులు,జిల్లా నాయకులు,మండల నాయకులు,  నెల్లికుదురు మండల వివిధ గ్రామాల  సర్పంచులు,వార్డు మెంబర్లు,  గ్రామ పార్టీ అధ్యక్షులు , పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -