నవతెలంగాణ -చిన్నకోడూరు
మాజీ మంత్రి హరీష్ రావుపై ఉన్న ప్రజాదరణను తట్టుకోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు పిన్నింటి అబ్బిరెడ్డి మండిపడ్డారు. బుధవారం చిన్నకోడూరులో విలేకరులతో మాట్లాడుతూ అధికార బలంతో హరీష్ రావు ఫ్లెక్సీలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఫ్లెక్సీలు తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న హరీషన్న అభిమానాన్ని చెరిపేయలేరన్నారు. తెలంగాణ సాధకునిగా, సాగు-తాగు నీరు అందించిన ప్రదాతగా ఆయన ప్రజల్లో నిలిచారని, కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పానుగంటి రమేష్, రాచకొండ బిక్షపతి, బంక పోచయ్య, పెసరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
హరీష్ రావు ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



