- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించింది. అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన ఈ మైదానం, ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య నేడు ప్రారంభమైన తొలి టెస్టుతో తన 150వ టెస్టు మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది. ప్రపంచంలో ఏ ఇతర స్టేడియం ఇంతవరకు ఇన్ని టెస్టులకు ఆతిథ్యం ఇవ్వలేదు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం 118 టెస్టులతో, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ 114 టెస్టులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- Advertisement -



