- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. సికింద్రాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గురునానక్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విశాల్ మదన్ ద్విచక్ర వాహనంపై జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉప్పల్‌కు బయలుదేరాడు. ఈక్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



