Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాట్సాప్ విప్లవం.. చరిత్ర సృష్టించిన సైమ్స్

వాట్సాప్ విప్లవం.. చరిత్ర సృష్టించిన సైమ్స్

- Advertisement -

 55 మంది పేద విద్యార్థులు ఆర్మీలో సెలక్షన్
నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

ప్రైవేట్ అకాడమీల సామ్రాజ్యాన్ని కదిలించిన సైమ్స్ 
ఫీజు రూ.0, కసి 100%.. పల్లె బిడ్డలు రాసిన చరిత్ర
బిల్డింగ్ అవసరం లేదు.. కసి ఉంటే చాలు.. బండారి ప్రసాద్
 
నవతెలంగాణ – ఆలేరు టౌన్: విద్య అంటే వ్యాపారం కాదు, సేవ అని నిరూపిస్తూ సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ (సైమ్స్ ) భారత దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం లిఖించింది.
లక్షల రూపాయల ఫీజులు, కోట్ల రూపాయల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ముసుగులో నడుస్తున్న ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల ముఖాలపై చెళ్లుమనిపించేలా, కేవలం ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా 2026 ఇండియన్ ఆర్మీ అగ్నివీర్  రిక్రూట్‌మెంట్‌లో 55 మంది యువకులకు ఉద్యోగాలు వచ్చేలా చేసి సంచలనం సృష్టించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి వచ్చిన ఈ 55 మంది యువకులు ఇప్పుడు దేశ సరిహద్దులను కాపాడే భాగ్యం పొందారు. ఇది రిజల్ట్ కాదు.. ఇది ఒక తిరుగుబాటు.
గత దశాబ్ద కాలంగా డిఫెన్స్ కోచింగ్ అంటే సామాన్యుడికి అందనంత దూరం. ఏడాదికి రూ.1.5 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఫీజులు వసూలు చేసి, 5 లేదా 10 మంది సెలెక్ట్ అయ్యారంటే గొప్పగా చెప్పుకుంటున్న అకాడమీల మధ్యలో సైమ్స్  ఒక్కసారిగా 55 మంది సెలెక్ట్ ఐన వారితో ఎంట్రీ ఇచ్చింది.

విశేషం ఏమిటంటే: ఫీజు – రూ.0
బిల్డింగ్ – లేదు
ఉన్నదల్లా ఒక కళ.. ఒక లక్ష్యం, ఒక వాట్సాప్ గ్రూప్

ఎంపికైన 55 మందిలో 50 మంది రైతు, వ్యవసాయ కూలీ, ఆటో డ్రైవర్, చిన్న దుకాణం నడిపే కుటుంబాలకు చెందినవారే. వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఈరోజు ఆనందబాష్పాలతో “మా కొడుకు ఆర్మీలో ఉన్నాడు” అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

 సైమ్స్  సక్సెస్ ఫార్ములా – 3 సూత్రాలు
సూత్రం:1 జీరో ఫీజు, మాక్స్ కమిట్మెంట్ .. పేద విద్యార్థి ఆర్థిక పరిస్థితి అతని కళకు అడ్డుకాకూడదు. ఈ సిద్ధాంతంతో సైమ్స్ అన్ని స్టడీ మెటీరియల్స్, పిడిఎఫ్  నోట్స్, డైలీ 100 ప్రశ్నల మాక్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ వీడియోలను ఉచితంగా అందించింది.
సూత్రం 2: 24×7 వ్యక్తిగత మెంటార్‌షిప్
సైమ్స్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్ ముదిరాజ్ ప్రతి విద్యార్థికి పర్సనల్ మెంటార్. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన డౌట్ అయినా, పరీక్షకు ముందు వచ్చిన టెన్షన్ అయినా స్వయంగా వాట్సాప్‌లో సమాధానం ఇచ్చేవారు. ఇది ఏ ప్రైవేట్ అకాడమీలోనూ జరగదు.
సూత్రం :3 పల్లె నుండి పాలిటెక్నిక్
టీజీ  & ఏపీలోని అదిలాబాద్ నుండి అనంతపురం వరకు, ప్రతి మండలం నుండి విద్యార్థులను గుర్తించి వారిని ఒకే వేదికపైకి తెచ్చారు. “నువ్వు ఒంటరివి కాదు, నీ వెనుక 1000 మంది సైనికులు ఉన్నారు” అనే భరోసా ఇచ్చారు.

ప్రశ్న: ఈ విజయ రహస్యం ఏమిటి
జవాబు: రహస్యం ఏమీ లేదు బ్రదర్. కోచింగ్ సెంటర్ అనేది ఒక సిస్టమ్ కాదు, అది ఒక ఆలోచన, కసి, క్రమశిక్షణ, దేశభక్తి ఉంటే వాట్సాప్ కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అవుతుంది. మా పిల్లలు అదే నిరూపించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -