Thursday, June 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం, శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -