Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోన్ గావ్ లో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ

డోన్ గావ్ లో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని డోన్ గావ్ జిపీ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామసభ బుధవారం నాడు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి కే. శ్రీనివాస్ అధ్యక్షతన  గ్రామ అభివృద్ధి పలాంశాల పైన చర్చించడం జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా  గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు స్పెషల్ ఆఫీసర్‌గా మిషన్ భగీరథ అధికారి హాజరయ్యారు. గ్రామ  సభలో “జల సంరక్షణ – మన సంరక్షణ” అంశంపై అవగాహన కల్పించడంతో పాటు, ప్లాంటేషన్, పంట మార్పిడి, విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తులు, గ్రామంలోని బావుల పూడిక తొలగింపు, బావులకు వెళ్లే దారుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించి తగిన సూచనలు చేశారు.

అలాగే పోలీస్ శాఖ అధికారులు రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన మరియు యువతలో అవగాహన పెంపు గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ గ్రామసభకు గ్రామసభ అధ్యక్షులు శ్రీ ఖానాపూర్ శ్రీనివాస్ గారు, ఉప సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శి శ్రీ అంజయ్య గారు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం మరియు సమస్యల పరిష్కారమే ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశ్యంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, వివిధ శాఖల అధికారులు, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -