Thursday, June 4, 2026
E-PAPER
Homeజాతీయంమమతా బెనర్జీపై మరో కేసు నమోదు

మమతా బెనర్జీపై మరో కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌ ‌మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై మరో కేసు నమోదైంది. గురువారం న్యాయవాది రింకీ ఛటర్జీ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై సిలిగురి పోలీస్‌ ‌స్టేషన్‌‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్యాంగ సంస్థలు, భద్రతా ఏజెన్సీల పరువు తీసేవిధంగా మమతా బెనర్జీ బహిరంగ ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ రింకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ప్రకారం దీదీపై కేసు నమోదైంది.

కాగా, ఇటీవలి కాలంలో బహిరంగ సభల్లో కానీ, రాజకీయ వేదికలపైన గానీ, మీడియా ముందుగానీ అసెంబ్లీ ఎన్నికలపైనే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం, ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి మోహరించిన కేంద్ర సాయుధ దళాలతో సహా భారత రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకంగా మమతాబెనర్జీ అనేక రెచ్చగొట్టే, ఉద్రేకపూరిత ప్రకటనలు చేశారాని రింకీ ఛటర్జీ ఆరోపించారు. జూన్‌ 2వ తేదీన రాణి రష్మోని స్మరానే రోడ్డు వద్ద జరిగిన నిరసన సందర్భంగా మమతా హోంమంత్రిత్వశాఖను ఆరోపించారు. బంగ్లాదేశ్ జాతీయుడు ఉస్మాన్ హాది హత్యకు సంబంధించి కేంద్ర హోం శాఖ ప్రమేయం ఉందని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సమాజం ముందు కేంద్ర ప్రభుత్వ గౌరవాన్ని, విశ్వసనీయను తగ్గించడం, భారత్‌- ‌బంగ్లా ఇరు దేశాల సార్వభౌమ దేశాల మధ్య శతృత్వాన్ని రెచ్చట్టేలా దీదీ వ్యాఖ్యానించారని రింకీ ఛటర్జీ సింగ్‌ ‌తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గత సంవత్సరం ఈద్‌ ‌వేడుకలో సనాతన ధర్మంపై మమతా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ న్యాయవాదే రింకీ ఛటర్జీ సింగ్‌‌నే సిలిగురి పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. గత వారమే మమతాపై కేసు నమోదైంది. తాజాగా మరోసారి రింకీనే మమతా వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -