బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి భవిష్యత్తు తరాలను కాపాడండి

నవతెలంగాణ- చండూరు: బ్యాట్ గుర్తుకు ఓటు వేసి  భవిష్యత్తు తరాలను కాపాడాలని తెలంగాణ ఉద్యమ నాయకుడు, విద్యార్థులు రాజకీయ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి నూనె సురేష్ అన్నారు.  సోమవారం  చండూర్ మండలంలోని  బంగారుగడ్డ, ఇడికుడ, బోడంగిపర్తి, దోనియాల పలు గ్రామాల్లో ప్రజలతో కలిసి కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే అభ్యర్థి నూనె సురేష్ మాట్లాడుతూ ఉచిత విద్య వైద్యం ఉపాధి కై కృషి చేస్తామన్నారు. ప్రతి మండలంలో ఉచిత కోచింగ్ సెంటర్లు, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని వారు అన్నారు. మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తానని,  మునుగోడు నియోజకవర్గం ప్రజలు నాలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న యువకుడికి ఆశీర్వదించి, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయటం జరుగుతుందన్నారు.
Spread the love