Friday, June 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసీసీఐ ఆనవాళ్లు కనుమరుగు..?​

సీసీఐ ఆనవాళ్లు కనుమరుగు..?​

- Advertisement -

కానరాకుండా పోనున్న చిమినీలు
వేగంగా సాగుతున్న కూల్చివేత పనులు
పోరాటం ఆపని సాధన కమిటీ నాయకులు
నోరుమెదపని ఎంపీ, ఎమ్మెల్యేలపై విమర్శలు
అయోమయంలో భూ నిర్వాసితులు

ఆదిలాబాద్ కు తలమానికంగా నిలిచిన సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చరిత్ర త్వరలోనే కనుమరుగు కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమను నేలమట్టం చేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తామన్న కేంద్రం గుట్టు చప్ప్పుడు కాకుండా తుక్కు కింద ఫ్యాక్టరీ సామగ్రిని టెండర్‌వేసి కాంట్రాక్టర్ కు అప్పగించింది. దాంతో సదరు కాంట్రాక్టరు కూల్చివేత పనులను వేగవంతం చేశారు. ఎన్నిక సమయంలో మూతబడి ఉన్న ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఓట్లు దండుకుని పదవులు పొందిన ఎంపీ, ఎమ్మెల్యే ఈ విషయంలో నోరు మెదపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో సీసీఐ సాధన కమిటీ వ్యతిరేకిస్తూ కూల్చివేత పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అప్పట్లో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలు తమ భూములు తిరిగి ఇస్తారోలేదోనని అయోమయంలో ఉన్నారు.

నవతెలంగాణ ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతిధి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోఁ సీసీఐ ఫ్యాక్టరీ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమఁ తెలుస్తోంది. తుక్కు కింద టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టరు కూల్చివేత పనులను వేగవంతం చేశాడు. ఏప్రిల్ 15న సామాగ్రి తరలించేందుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్న టెండర్ దారును సీసీఐ సాధన కమిటీ అడ్డుకుంది. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన కాంట్రాక్టు సూపర్‌వైజర్ ఇటీవల గుట్టు చప్ప్పుడు కాకుండా 7 అంతస్తుల ఎత్తయిన అతిపెద్ద ప్యాకింగ్ ప్లాంట్ కూల్చి వేశారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కనిపించే సీసీఐ ఫ్యాక్టరీ అతిపెద్ద చిమినీలు త్వరలో కూల్చివేస్తారని తెలుస్తోంది. అప్పట్లో సమీప గ్రామాల ప్రజలు ఆదిలాబాద్ ఎటువైపు ఉందో తెలపటానికి ఎతైన సీసీఐ పొగ గొట్టాలను చూపేవారు. త్వరలో అవి కానరాకుండా పోనున్నాయి. ఒకప్ప్పుడు ఆదిలాబాద్‌లో సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేదంట అని చెప్ప్పుకునే పరిస్ధితి రానుంది. ఈ విషయంలో స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రజలను మోసం చేసి పదవులు అదీష్టించి సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మివేశారని ఆరోపణలు చేస్తున్నారు. వారి అసమర్ధత వల్లనే ఈ ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతోందని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం వత్తాసు పలుకుతోందని అపవాదు మూటగట్టుకుంది. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని తిరిగి వారి భూములు వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

త్వరలో పూర్తిగా నేలమట్టం
సీసీఐ పరిశ్రమలోని భారీ యంత్రాలు, సిమెంట్ తయారీకి సంబంధించిన పనిముట్లను తరలించి నేలమట్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 760 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీ స్థలంలో టెండర్ దక్కించుకున్న సంస్థ ఏ చిన్న వస్తువును కూడా వదలకుండా ఇక్కడి నుంచి తరలిస్తారని తెలుస్తోంది. కార్మికులు, ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన సుమారు 400 క్వార్టర్స్‌ను సైతం కూలగొట్టి సామగ్రిని తరలిస్తున్నారు. సిమెంటు తయారీకి ఉపయోగపడే మోటార్లు, రెండు భారీ చిమినీలు(పొగగొట్టాలు) తీసుకెళ్లేందుకు చర్యలు సాగుతున్నాయి. సామగ్రి తరలించే ప్రక్రియ వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల కూల్చి వేసిన ప్యాకింగ్ కూల్చివేత దృశ్యాలను అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పెద్ద ఎత్తున వైరయింది. అందులో పఁచేసిన కార్మికులు ఆ దశ్యాలను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఎప్పటికైనా ఫ్యాక్టరీ పున:ప్రారంభించి తమకు ఉద్యోగాలు వస్తాయని భావించిన వారి ఆశలు అడిఆశలు అయ్యాయి.

ఆందోళనలో భూ నిర్వాసితుల కుటుంబాలు
1982 ఆగస్టు 15న 4000 మంది ఉద్యోగులు, కార్మికులతో సీసీఐ ప్రారంభమైంది. 760 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పరిశ్రమ స్థలంలో ఉద్యోగులకు క్వార్టర్లు, అవసరమైన అన్ని సదుపా యాలు సమకూర్చారు. సిమెంట్ తయారీకి అవసరమైన ముడిసరుకు 2000 ఎకరాలను కొనుగోలు చేశారు. 1984లో నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి తివారీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. 1991లో సిమెంటు ఉత్పత్తిఁ ప్రారంభించారు. దేశ నలుమూ లల సిమెంటును సరఫరా చేసి మంచి లాభాలు అర్జించింది. 1991 నుంచి 1993 వరకు మూడు సంవత్సరాల పాటు లాభాల బాటలో కొనసాగింది. 100 యేండ్లపాటు కొనసాగుతుందని భూ నిర్వాసి తులకు ఉద్యోగాలు ఇచ్చిన మూడు సంవత్సరాల్లోనే నష్టాలు చూపి ఉద్యోగాల నుంచి తొలగించారు. అటు సాగు చేసుకునేందుకు భూమి లేక ఉద్యోగాలు కోల్లోయిన వారు ఇప్ప్పుడు తమ భూమి తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తమ భూములు తమకు ఇస్తుందో లేదో తెలి యక భూ నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అన్యాం చేశాయి : దర్వనాల మల్లేష్, సీసీఐ సాధన కమిటీ, కన్వీనర్
వంద సంవత్సరాల కొనసాగుతుందని నమ్మకంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులు భూములిచ్చారు. 12 సంవత్సరాలకే దాన్ని మూసివేశారు. ఫ్యాక్టరీ మూసివేసినపుడు వారి భూములు వారికి తిరిగి ఇచ్చేయాలి. కాని ఆ భూముల్ని డిఫెన్స్‌కో, రియలఎస్టేట్ వ్యాపారానికో వాడుకోవడాఁకి చూస్తున్నారు. అప్ప్పుడు రూ.3 వేల ఎకరం పలికిన భూమి ఇప్ప్పుడు రూ.3 కోట్ల విలువ పలుకుతోంది. కేంద్రం వారి భూములు వారికి ఇవ్వాలి లేదా అక్కడ కొత్త ఫ్యాక్టరీ నిర్మించి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భూ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేశాయి.

రోడ్డుపైకి తీసుకు వస్తున్నారు : 
బొల్లు ఈశ్వర్‌దాస్, భూ నిర్వాసితుడు, బెల్లూరి గ్రామం
కూల్చివేత దశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఉన్న 15 ఎకరాల భూమిని ఫ్యాక్టరీకి ఇస్తే ఇద్దరు అన్నలకు ఉద్యోగాలు ఇచ్చారు. నేను అందులో కార్మికుడిగా పనిచేశాను. ముగ్గురం ఉపాది కోల్పోగా భూమి కూడా ఇవ్వరని అంటున్నారు. 8 ఎకరాలు క్వారీలో పోగా 7 ఎకరాలు సాగు చేసుకుంటున్నాను. ఆ భూమి కూడా తీసుకుంటే ఉద్యోగం లేక భూమి లేక రోడ్డుపైకి వస్తాను. మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలి.

రోడ్డుపైకి తీసుకు వస్తున్నారు
కూల్చివేత దశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఉన్న 15 ఎకరాల భూమిని ఫ్యాక్టరీకి ఇస్తే ఇద్దరు అన్నలకు ఉద్యోగాలు ఇచ్చారు. నేను అందులో కార్మికుడిగా పనిచేశాను. ముగ్గురం ఉపాది కోల్పోగా భూమి కూడా ఇవ్వరని అంటున్నారు. 8 ఎకరాలు క్వారీలో పోగా 7 ఎకరాలు సాగు చేసుకుంటున్నాను. ఆ భూమి కూడా తీసుకుంటే ఉద్యోగం లేక భూమి లేక రోడ్డుపైకి వస్తాను. మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలి.
-బొల్లు ఈశ్వర్‌దాస్, భూ నిర్వాసితుడు, బెల్లూరి గ్రామం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -