- Advertisement -
నవతెలంగాణ – కుభీర్ : ప్రమాదవాషత్తు విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి చెందిన సంఘటన సోమవారం కుభీర్ మండలంలోని మలేగాం గ్రామమలో చోటుచేసుకుంది. రైతు తెలపిన వివరాల ప్రకారం మలేగాం గ్రామానికి చెందిన భూషణ్ అనే రైతుకు సంబదించిన ఎద్దులు తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పశువుల కొట్టంలో రోజు మాదిరిగానే కట్టేయగా అందులో ఒక్క ఎద్దు తాడు విడిపించుకొని మేత మెస్తుండగా ప్రమాదవశాత్తు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చేందడం జరిగింది. దీంతో రైతు దాదాపుగా 80వేల వరకు నష్టపోయాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ప్రభుత్వం రైతుకు ఆదుకోవాలని కోరారు.
- Advertisement -



