నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని పి జె ఆర్స్ స్పూర్తి డిగ్రీ కళాశాల లో టాస్క్ ఆధ్వర్యంలో అర్థమెటిక్ రీజనింగ్ పై శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి డిస్ట్రిక్ట్ టాస్క్ మేనేజర్, అర్థమెటిక్ రీజనింగ్ ట్రైనెర్ రఘు తేజ శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం లో కళాశాల కరస్పాండెంట్ అండ్ చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధి కల్పనలో ఈ తరగతులు ఎంతో ఆవశ్యకం అని పోటీ ప్రపంచంలో ఇలాంటి శిక్షణ తరగతులు విద్యార్థులు యొక్క సర్వతోముఖాభివృద్ధి కి ఉపయోగ పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్ కుమార్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ ఎం.కృష్ణ ప్రసాద్ గౌడ్ , టాస్క్ కోఆర్డినేటర్ సతీష్, వెంకటేష్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పిజెఆర్స్ కళాశాలలో అర్థమెటిక్ రీజనింగ్ పై టాస్క్ శిక్షణా తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



