- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటకలో ఐపీఎస్ భార్యపై ఏనుగు దాడి చేసింది. ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అన్నలమడ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51) అడవి ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కొడగు జిల్లాలోని గోనికొప్పల్ సమీపంలో ఉన్న కోననకట్టె గ్రామంలోని కాఫీ తోటలో పరిశీలిస్తుండగా, ఒక అడవి ఏనుగు అకస్మాత్తుగా వారిపై దాడికి తెగబడింది. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.
- Advertisement -



