Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ కట్టడి: సీపీ

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ కట్టడి: సీపీ

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్    
సీసీ కెమెరాల ఏర్పాటు వలన నేరాల నియంత్రణ కట్టడి చేయవచ్చునని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం  పట్టణంలోని మామిడిపల్లి సాయి గార్డన్స్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణం నెలకొని ఉన్న ప్రాంతాలు సత్వర అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. నేరాల నియంత్రణకు ఉపకరిస్తూ, నేరాలు జరిగిన సందర్భాలలో నిందితుల ఆచూకి తెలుసుకునేందుకు ఉపకరించే సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని , సైబర్ నేరగాళ్ల నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన వారికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సంబంధిత విలేజ్ పోలీస్ ఆఫీసర్ సంబంధించిన అధికారికి సంప్రదించగలరు. లేదా వారికి విలేజ్ పోలీసు ఆఫీసర్ నంబర్ అయిన ఇవ్వగలరు. మత్తు పదార్థాలు , దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకుని రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కృషి చేయాలన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని , ప్రజలకు భద్రతా కల్పించడానికి పోలీసు శాఖ ఎల్లవేళలా సమాయత్తంగా ఉంటుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఏసిపి  వెంకటేశ్వర రెడ్డి,  ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, మున్సిపాలిటీ చైర్మన్ గోనెలహరి, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, అగ్రికల్చర్ అధికారి హరికృష్ణ, కౌన్సిలర్లు భూపేందర్, పోచంపేట శ్రీనివాస్, డిచ్పల్లి శారద దినేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -