నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి పనులను మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ మంగళవారం సందర్శించి ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు పురోగతి గురించి హౌసింగ్ ఏ ఈ హనుమంతు ను అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ను గ్రామంలో గల ఇందిరమ్మ ఇండ్ల పురోగతి నివేదికలను కోరారు. ఆ తర్వాత మండలంలోని శాఖాపూర్ గ్రామం సందర్శించి అక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మార్కౌట్ ఇచ్చి ప్రారంభించని లబ్ధిదారులను వెంటనే ప్రారంభించగలరని ఆదేశించారు. శాఖాపూర్ గ్రామ నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం నర్సరీ పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో రాణి, హౌసింగ్ ఏఈ హనుమంత్, మద్నూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్, షేకాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి, అలాగే ఏపీఓ పద్మ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



