”పడిపోయిన చోటే లేచి నిలబడాలి” అనే సామెత జీవితంలో పరాజయం పొందిన చోటే పోరాడి విజయం సాధించాలి అనే స్ఫూర్తిని కలిగిస్తుంది. మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయిన తర్వాత వెనక్కి తగ్గిపోవడం కాదు, అదే చోట మళ్లీ ధైర్యంగా లేచి ప్రయత్నించడంలోనే ఉంది గొప్పతనం. ఎందుకంటే ప్రతి ఓటమి మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది, ప్రతి అవరోధం మనలో అంతర్లీనంగా దాగి ఉన్న అసలు శక్తిని బయటకు తీసుకొస్తుంది. విజయాన్ని అందుకునే వారు ఎప్పుడూ పరాజయం పొందని వారు కాదు. పరాజయం పొందినా మళ్లీ పోరాడి విజయం సాధించిన వారే. అలాంటి స్ఫూర్తిదాయకమైన ప్రయాణమే చేశాడు డాక్టర్ ఆనంద్ మేగలింగం.
జీవితంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా అతను వెనుకడుగు వేయలేదు. మొక్కవోని సంకల్పంతో, చదువు కోసం కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ప్రతి కష్టాన్ని విజయానికి మెట్టుగా మార్చుకున్నారు. ఓ ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రపంచం గర్వించదగిన స్థాయికి చేరి మరెందరికో ప్రేరణనిచ్చే అద్భుత విజయగాథగా నిలిచింది.
అవమానాన్ని సవాలుగా…
చెన్నైకి చెందిన డాక్టర్ ఆనంద్ మేగలింగం జీవితం యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి ఒక ట్రాక్టర్ డ్రైవర్. చిన్నప్పటి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులు పెద్దగా అనుకూలించకపోయినా, పేదరికం ఆయన అడుగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, అతని ఆశయాలు దఢ సంకల్పం ముందు పేదరికం చిన్నబోయింది. కష్టాలు ఆయన జీవితాన్ని పరీక్షించాయి. కానీ, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ బలహీనపరచలేకపోయాయి. ప్రతి అవమానాన్ని ఒక సవాలుగా తీసుకుని, ఎన్ని కష్టాలు ఎదురైనా, తన జీవితాన్ని ఒక గొప్ప లక్ష్యంతో మలచుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగాడు.
కొత్త ఆలోచనకు బీజం
చిన్నతనంలో ఆకాశం, నక్షత్రాలు, అంతరిక్షంపై అతనికి ప్రత్యేకమైన ఆసక్తి లేనప్పటికీ, ఒకరోజు కళాశాల ఆవరణలో స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుండగా, ఆకాశంలో దూసుకెళ్తున్న విమానాన్ని గమనించాడు. ఆ క్షణం అతని మనసులో ఒక కొత్త ఆలోచనకు బీజం పడింది. ఆకాశంలో ఎగిరే ఆ విమానం కొత్త ఆశయాలకు నాంది పలికింది. ఆ రోజు కనిపించిన ఆ చిన్న దశ్యమే అతని జీవిత గమ్యాన్ని మార్చేసింది. ”ఒకరోజు నేనూ ఈ అంతరిక్ష, ఏరోస్పేస్ ప్రపంచంలో నా ముద్ర వేయాలి” అనే సంకల్పం ఆయనలో బలపడింది. అదే కల, అదే పట్టుదల అతన్ని అంతరిక్ష రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లింది.
సబ్జెక్టులు అర్థం కాదు
చిన్నతనంలో ఇంటి పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా చదువుపై అతని ఆసక్తి మాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆరు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లేవాడు. ఆ ప్రయాణమే ఆయనలో సహనం, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలను పెంచింది. ఇంటర్ పూర్తయ్యాక అందరిలాగే మంచి ఉద్యోగం సంపాదించాలని భావించి ఎంసెట్ రాశాడు. కంప్యూటర్ సైన్స్‌లో సీటు వచ్చిన తర్వాత కాలేజీలో చేరాడు. కానీ అక్కడి సబ్జెక్టులు ఆయనకు అర్థం కాలేదు. ఆసక్తి లేని చదువు అతనికి భారంగా మారింది. చివరికి మధ్యలోనే కాలేజ్ చదువుకు స్వస్తి పలికాడు. చాలా మంది అక్కడితోనే జీవితాన్ని ఓటమిగా భావించి ఆగిపోతారు. కానీ ఆనంద్ మాత్రం తన తప్పును గుర్తించారు.
స్పేస్-టెక్ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా
”మనసుకు నచ్చిన దారిలోనే నిజమైన విజయం ఉంటుంది” అని అర్థం చేసుకున్న ఆనంద్ మళ్లీ చదువును ప్రారంభించాడు. ఈసారి తనకు ఇష్టమైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నాడు. కష్టపడి చదివి అద్భుతమైన అకడమిక్ మార్కులు సాధించడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. కాలేజ్ చదువు పూర్తి చేసిన అనంతరం డాక్టర్ ఆనంద్ మేఘలింగం స్పేస్ జోన్ ఇండియాను స్థాపించాడు. అలా ప్రైవేట్ స్పేస్-టెక్ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా నిలిచాడు. ఈ ”స్పేస్ జోన్ ఇండియా” భారతదేశంలో అభివద్ధి చెందుతున్న ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్పేస్ జోన్ ఇండియా పరిమిత వనరులతో, గొప్ప ఆశయాలతో ప్రారంభమైంది. ప్రారంభ అభివద్ధిలో ప్రయోగాత్మక ఆవిష్కరణలతో కీలక పాత్ర పోషించడమే కాకుండా అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా నిలదొక్కుకుంది.
అంతరిక్ష పరిశోధనలకు కొత్త అవకాశాలు
భారతదేశపు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర రోజురోజుకీ విస్తరిస్తోంది. అలాంటి అభివద్ధికి ప్రతీకగా నిలిచిన విజయాల్లో ఒకటే =నఖవీ×-న మిషన్. మొబైల్ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రయోగించిన భారతదేశపు తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ విజయంతో ఆ సంస్థ పేరు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. =నఖవీ×-న మిషన్ సాధారణ రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు; ఇది భారతదేశపు ప్రైవేట్ అంతరిక్ష రంగం సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘట్టం. తక్కువ వ్యయంతో, పునర్వినియోగ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలకు కొత్త అవకాశాలు తెరచే సామర్థ్యాన్ని పెంచుకుంది. ముఖ్యంగా మొబైల్ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రయోగించగల సామర్థ్యం దీని?న మరింత వినూత్నంగా నిలబెట్టింది.
ధైర్యమైన అడుగులకు ప్రతీక
కొద్దికాలంలోనే =నఖవీ× మిషన్ ప్రాముఖ్యత అమాంతం పెరిగింది. భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీపై జరుగుతున్న ప్రతి చర్చలో ఈ సంస్థ పేరు ప్రస్తావనకు రావడం దాని ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ సంస్థలకే పరిమితమై ఉన్న అంతరిక్ష రంగంలో ఇప్పుడు యువ శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు కూడా విశేష ప్రతిభ కనబరుస్తున్నాయనే నమ్మకాన్ని ఈ విజయం బలపరిచింది. ఈ ఘనత కేవలం ఒక సంస్థ విజయమే కాదు, భారతదేశం సాంకేతికంగా స్వయం సమద్ధి వైపు వేస్తున్న ధైర్యమైన అడుగులకు ప్రతీక. యువతలో విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంచుతూ, ”భారతదేశం కూడా ప్రపంచ అంతరిక్ష పోటీలో ముందంజలో నిలవగలదు” అనే ఆత్మవిశ్వాసాన్ని =నఖవీ×-న మిషన్ మరింత బలపరిచింది.
అరుదైన అవకాశం
డాక్టర్ మేగలింగం ఏరోస్పేస్ మొదట యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు. ఆ సంస్థ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందలేదన్న కారణంతో వీసా తిరస్కరించారు. కానీ అతను ఏమాత్రం కుంగిపోకుండా స్వదేశంలోనే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివద్ధి చేయడంపై దష్టి పెట్టాడు. జీవితంలో కొన్ని అవకాశాలు మన గమ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి అరుదైన అవకాశమే ఆనంద్ జీవితంలో కూడా వచ్చింది. ఎన్నో కష్టాలు, తిరస్కరణలు ఎదుర్కొన్న అతని ప్రతిభ చివరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కొన్నేండ్ల తర్వాత అతనికి ఊహించని విధంగా ఒక గొప్ప అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నాయకత్వ కార్యక్రమం కోసం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆనంద్‌ను ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులలో కొద్దిమందికే లభించే ఈ అరుదైన అవకాశం అతని ప్రతిభకు దక్కిన గొప్ప గౌరవం.
అద్భుతమైన క్షణం.
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కార్యక్రమంలో భాగంగా ఆయనకు నాసా సంబంధిత సౌకర్యాలను సందర్శించే అవకాశం లభించింది. నిర్మాణాత్మక నాసా శిక్షణా కార్యక్రమం ద్వారా ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, రక్షణ రంగ నిపుణులు, ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపే అరుదైన అవకాశాన్ని పొందారు. చిన్న గ్రామం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన యువకుడికి ఇది సాధారణ విషయం కాదు. తన కలల ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూసే అద్భుతమైన క్షణం. ఒకప్పుడు అవకాశాల లేమితో తిరస్కరణలు ఎదుర్కొన్న ఆనంద్ తర్వాత కాలంలో అదే అంతర్జాతీయ ఏరోస్పేస్ ప్రపంచంలో గుర్తింపు పొందడం నిజంగా స్ఫూర్తిదాయకం.
కోట దామోదర్
9391480475



