- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో మరో అవినీతి పోలీసు అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్సై వినయ్ ఈరోజు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే, ఓ కేసు విషయంలో సహకారం అందిస్తానంటూ ఫిర్యాదుదారుడి నుంచి వినయ్ రూ. 50 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం డబ్బులు తీసుకుంటున్న తరుణంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదును సీజ్ చేశారు. ఎస్సై వినయ్ ని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



