Sunday, June 7, 2026
E-PAPER
Homeకవితవలసపిట్ట

వలసపిట్ట

- Advertisement -

ఆ.. పిట్ట
ఎగిరిపొయింది,
ఉన్న గూటిని
వదిలిపెట్టి
కొత్తగూటిని
వెతుక్కుంటూ
వెల్లి పొయింది
ఆ.. పిట్ట..!
చక్కని స్వరం
ఆ.. పిట్ట స్వంతం,
కూనిరాగాల నుండి,
కురుక్షేత్ర యుద్దాన్ని కూడా
మిమిక్రీ చేయగల,
దిట్ట.. ఆపిట్ట..!
అవధానాలనే కాదు,
అంత్యాక్షరీలూ
ఆడగలదు..
గూటిలోని
తోటి సహచర ప్రాణికి,
సర్వసుఖాలూ
అందివ్వగలదు,
పొగడ్తలకు
ఉప్పొంగిపోయి,
నెమలిలా పురివిప్పి
నాట్యం చేయగలదు!
పక్షి పరివారంతో
తగువు పెట్టుకుందో,
ఇతరపక్షుల
ఆగమనం చూచి,
ప్రేమపక్షుల
జాడ తెలిసి,
బెదిరిపోయిందో…
ఆ వలసపిట్ట,
ఉన్న గూడు వదలి
కొత్తగూడు
వెతుక్కుంటూ,
ఎగిరిపొయింది,
లౌక్యం తెలియని
తొందరపాటు
వలస పిట్ట..
డా.కె .ఎల్‌.వి.ప్రసాద్‌, 9866252002

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -