Wednesday, February 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమైనార్టీల విద్యపై చిన్నచూపు!

మైనార్టీల విద్యపై చిన్నచూపు!

- Advertisement -

మైనార్టీల విద్యపై ముప్పేట దాడి జరుగుతున్నది. ఇప్పటికే హిజాబ్‌, మతపరమైన విభజన రేఖలు, సామాజిక అభద్రతా అంశాలతో వారి చదువులు కుంటుపడ్డాయి. జాతీయ సగటుతో పోల్చుకుంటే.. ముస్లింల అక్షరాస్యత శాతం తక్కువ. డ్రాపౌట్లు ఎక్కువ. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రాతినిధ్యం పరిమితమే. జనాభాలో పదిహేను శాతమున్నా.. ఉన్నత విద్యలో ప్రాతినిధ్యం నాలుగు శాతమే. ఈ నేపథ్యంలో మైనా ర్టీల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన కేంద్రం.. బడ్జెట్‌ రూపంలో మరోదెబ్బ కొట్టింది. కాగితంపై కనిపించే అంకెలు, క్షేత్ర స్థాయిలో విడుదలవుతున్న నిధుల మధ్య ఉన్న అగాథం.. మైనార్టీల విద్యను నిర్వీర్యం చేసే కుట్రనా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.ప్రతియేటా బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి కొన్ని వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తున్నది. కానీ, ఆ తర్వాత నిధుల విడుదలలో అసలు వాస్తవం బయటపడు తున్నది. 2026-27లో రూ.3400 కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ‘రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌’ దగ్గరే అసలు విషయం బోధపడుతుంది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో రూ.3,350 కోట్లు ఇచ్చి నట్టు చూపింది. అయితే ఖర్చు చేసింది రూ.2,160 కోట్లు మాత్రమే. అంతకుముందు ఏడాది 2024-25లో రూ. 3,183 కోట్లు కేటాయించినట్లు ప్రకటిస్తే.. ఖర్చు చేసింది రూ. 714 కోట్లు మాత్రమే. పార్ల మెంట్‌ సాక్షిగా కేటాయించిన నిధుల్లో సగం కూడా లబ్ధిదా రులకు చేరలేదన్నది వాస్తవం. అయితే ఇది కేవలం నిర్లక్ష్యమా? లేక ఒక పథకం ప్రకారం చేస్తున్నదా? అనేది ఆలోచించాల్సిన విషయం.

ఏ సమాజమైనా పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే మార్గం. కానీ కేంద్రం సరిగ్గా ఆ విద్యారంగంపైనే ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం చూపిస్తున్నది. ఒకటో తరగతి నుంచి ఇచ్చే ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్స్‌ ను తొమ్మిదో తరగతికి పెంచ డం ద్వారా పునాది దశలోనే నిరుత్సాహానికి గురి చేసినట్ల యింది. మెరిట్‌ – కమ్‌ -మీన్స్‌ స్కాలర్‌ షిప్‌ పరిస్థితి మరీ ఆశ్చర్యకరంగా ఉంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి వఅత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఇది ఎంతో ఆసరాగా ఉండేది. గతేడాది దీనికి రూ. 7.34 కోట్లు కేటాయించి.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈసారి బడ్జెట్‌ లో దీన్ని 99శాతం తగ్గించి రూ.ఆరు లక్షలకు కుదించారు. దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు రూ.ఆరు లక్షలు ఏ మూలకు సరిపోతాయో కేంద్రానికే తెలియాలి. అలాగే పీహెచ్‌ డీ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచిన మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ను ఇప్పటికే కేంద్రం రద్దు చేసింది. వీటికి సంబంధించి బకాయిల కోసం గతేడాది రూ.45 కోట్లకు పైగా కేటాయిస్తే.. ఈసారి దాన్ని రూ.36 కోట్లకు తగ్గించారు. ఇది పరిశోధనల వైపు మైనార్టీ విద్యార్థులు వెళ్లకుండా అడ్డుకోవడమే.

విడుదల చేసిన కొంచెం నిధుల్లో కూడా కేంద్రం నుంచి రాష్ట్రాలకు, అక్కడి నుంచి విద్యార్థుల ఖాతాలోకిచేరే ప్రక్రియ లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీనికి తోడు ఆధార్‌ సీడింగ్‌, బయోమెట్రిక్‌ సమస్యలు, పోర్టల్‌ లోపాలను సాకుగా చూపి.. కేటాయించిన నిధులను లాప్స్‌ చేస్తున్నారు. ‘విద్యార్థులు వినియోగించుకోలేదు. కాబట్టి నిధులు తగ్గించాం’ అని వచ్చే ఏడాది బడ్జెట్‌లో కోతలు విధిస్తున్నారు. విద్యాపరంగా వెనక బడిన వర్గాలను చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అంకెల గారడిని పక్కన పెట్టి చిత్తశుద్ధితో నిధు లు విడుదల చేసినప్పుడే ‘సబ్‌ కా వికాస్‌’ అనే మాటకు నిజమైన అర్థం.

-మహమ్మద్‌ ఆరిఫ్‌, 7013147990

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -